• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నైట్ లైఫ్‌కు అలవాటు పడిన బిటెక్ విద్యార్థిని, ఇంట్లోనే బంగారం చోరీ

By Pratap
|

Hyderbaad
హైదరాబాద్: నైట్ లైఫ్‌కు అలవాటు పడిన ఓ విద్యార్థిని తన ఇంట్లోనే చోరీకి పాల్పడింది. హైదరాబాదులోని లంగర్ హౌస్‌లో నివాసం ఉంటున్న మౌనికా రెడ్డి అనే బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థిని తన ఇంట్లోంచి 17 తులాల బంగారం దొంగతనం చేసింది. ఇంట్లో ఆమె తన తల్లితో ఉంటోంది. బంగారం పోవడంతో మౌనికా రెడ్డి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి అనుమానంతో మౌనికా రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

బంగారాన్ని తానే ఎత్తుకెళ్లాలని, దాన్ని అమ్మి జల్సాలు చేశానని మౌనికా రెడ్డి అంగీకరించింది. విషయం తెలిసిన తల్లి నివ్వెరపోయి కన్నీరు మున్నీరవుతోంది. మౌనికా రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, మౌనికా రెడ్డి తాను తప్పు చేశానని, మీడియా ముందు ప్రవేశపెడితే ఆత్మహత్య చేసుకుంటానని బోరుమంది. దీంతో పోలీసులు ఆమె ముఖం కనిపించకుండా మీడియాకు వివరాలు అందించారు.

English summary
A B Tech first year girl student resoterted to theft in her own house to spend for lavish habits. 17 tulas of gold was stolen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X