రెండు మూడు కేంద్రాల్లో మినహా పులివెందులలో శాంతిభద్రతలు: భన్వర్‌లాల్

ఉప ఎన్నికల్లో ఎక్కువ మంది డిఎస్పీలు అవసరం లేదని భన్వర్‌లాల్ చెప్పారు. అదనంగా ఉన్న డిఎస్పీలను మాత్రమే వెనక్కి పంపించామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక డిఎస్పీని ఉంచామన్నారు. అయితే అంతకుముందు టిడిపి జిల్లా కలెక్టర్‌కు 40 మంది డిఎస్పీలను వెనక్కి పంపించారని చేసిన ఫిర్యాదుపై ఆయన పై విధంగా స్పందించారు. ఈవిఎంలలో పెద్దగా ఇబ్బందులు లేవన్నారు. కేవలం ఒక్క ఈవిఎం మాత్రమే కొద్దిసేపు మొరాయించిందని చెప్పారు. అభ్యర్థులు ఎక్కువమందిని వెంట వేసుకొని తిరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్లు కూడా తాము ఓటు ఎవరికి వేశామో అక్కడే బహిర్గతం చేయరాదన్నారు.












Click it and Unblock the Notifications