బంజారాహిల్స్‌లో కలకలం రేపిన కాల్పులు: గాల్లోకి మూడు రౌండ్లు
Districts
oi-Srinivas
By Srinivas
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో పట్టపగలు రామారావు అనే వ్యక్తి గాల్లోకి మూడు రౌండ్లు తుపాకితో కాల్పులు జరిపి కాలనీ వాసులను భయాందోళనకు గురి చేశారు. రామారావు ఓ రియాల్టర్. బంజారాహిల్స్‌లోని ఓ స్థలం విషయంలో గత ముప్పయ్యేళ్లుగా రామారావుకు మరొకరితో వివాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ స్థలం వెయ్యి గజాలు ఉంటుందంట. ఆ వివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది.
రామారావు తన లైసెన్సుడు రివాల్వర్‌తో మూడు రౌండ్లు కాల్చాడు. అయితే కాల్పులు జరిపి రామారావు తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు రామారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.