కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంపంకంలో వెనక్కి తగ్గిన యువనేత: ప్రత్యర్థులు పుంజుకోవడమే కారణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో తన పార్టీ విజయంపై ధీమాను ప్రదర్శిస్తూ వచ్చిన యువనేత పోలింగ్‌కు ముందే మడమ తిప్పినట్లుగా తెలుస్తోంది. సెంటిమెంట్ అస్త్రంతో ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఇంతవరకూ చెబుతూ వచ్చిన యువనేత ప్రత్యర్థి పార్టీలు ఒక్కసారిగా పుంజుకోవడంతో ఒకింత షాక్‌కు గురయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీలు తన కంటే ఓటర్లకు ఎక్కువగా డబ్బులు పంచినట్లు వార్తలు రావడం, ఇదే సమయంలో యువనేత లక్ష కోట్లు సంపాదించి తమకు డబ్బులు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారన్న నిరసన వ్యక్తం చేయడాన్ని ఊహించలేదు.

ఓటర్లకు డబ్బుల పంపిణీ విషయంలో తాను ముందుగా అనుకున్నట్లుగా ఇవ్వడానికి కట్టుబడి ఉంటానంటూ తన వర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల వద్ద కరాఖండీగా చెప్పినప్పటికీ ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం పులివెందులలో ముందుగా పంపిణీ చేసిన దానికి రెండింతలు ఇచ్చారంట. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా 200 నుంచి 500 రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చారు. అయితే సొంత నియోజకవర్గం పట్ల ఒక రీతిలోనూ మిగిలిన నియోజకవర్గాల పట్ల మరో తీరుగా వ్యవహరించడం పట్ల ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

English summary
It seems, Yuvanetha was step back on cash distribution. He was decided to give 500 rupees per vote first. But voters were demanded for Rs.1000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X