లవ్ అఫైర్: లేడీ కానిస్టేబుల్ లలిత మృతి, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ కాల్పులు జరిపిన ఘటన సంచలనం కలిగించింది. కానిస్టేబుల్ శ్రీనివాస్, మహిళా కానిస్టేబుల్ లలితపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే సోమవారం తెల్లవారు జామున ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మహిళాకానిస్టేబుల్ లలిత తీవ్రంగా గాయపడింది. ఆమెను కాల్చి శ్రీనివాస్ తానూ కాల్చుకోవడంతో ఇద్దరినీ హుటాహుటిన స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు.
గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని అదే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. 2009 బ్యాచ్‌కి చెందిన లలిత స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం. కాగా శ్రీనివాస్‌ది రంగారెడ్డి జిల్లా. ఇద్దరూ 2009లోనే ఇద్దరు కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమవ్యవహారం సాగుతోందని అంటున్నారు. రాత్రి సెంట్రీ డ్యూటీలో ఉన్న శ్రీనివాస్ లలిత తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెంట్రీ బుక్‌లో రాశాడు.
లలిత వరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసు అధికారులు చెప్పారు. శ్రీనివాస్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు. అయితే, లలిత కుటుంబ సభ్యులు అంగీకరించరనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ స్థితిలో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications