లాడెన్ హెర్బల్ వయాగ్రా వాడేవాడు, డయాలసిస్ లేదు: భార్య సదా

లాడెన్ రెండు మూత్రపిండాలకు శస్త్రచికిత్స జరిగిందని, దాని నుంచి ఆయన కోలుకున్నారని ఆమె చెప్పింది. స్థావరంలో లభించిన మందుల ప్రకారం లాడెన్ అంత బలహీనంగా లేడని వెల్లడైంది. లాడెన్ బలహీనంగా లేడని 29 ఏళ్ల సదా స్పష్టం చేసింది. కాగా, అమెరికా లాడెన్ ముగ్గురు భార్యలను విచారించేందుకు అవకాశం కల్పించాలని పాకిస్తాన్‌ను డిమాండ్ చేస్తోంది.
పాకిస్తాన్‌లోని అబ్బొత్తాబాద్‌లో పాకిస్తాన్‌కు లాడెన్ ముగ్గురు భార్యలతో సహా దొరికిన వారిందరినీ తాము విచారించడానికి అవకాశం కల్పించాలని, స్థావరంలో లభించిన వస్తువులను తమకు అప్పగించాలని అమెరికా పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. లాడెన్ భార్యలు, పిల్లలు ప్రస్తుతం పాకిస్తాన్ అదుపులోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications