వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇండియన్స్‌పైకి పాక్ ఐఎస్ఐ ఉగ్రవాదులను ఉసిగొల్పింది: వికీలీక్స్ వెల్లడి

తమ దేశంలోని ఉగ్రవాదులను భారతదేశంలోకి ప్రవేశపెట్టి భారతీయులను చంపాలని సూచించిందని చెప్పింది. ఐఎస్ఐ సూచించిన లక్ష్యాలను పూర్తి చేయాలని పాకిస్తాన్ సైన్యం కూడా మిలిటెంట్లకు సూచించినట్లు వెల్లడించింది. ఆల్ ఖైదా ఢిల్లీకి చెందిన తబ్లిగి జమాత్ తన కవర్‌గా వాడుకుందని వికీలీక్స్ వెల్లడించింది. ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందడానికి, ఆశ్రయానికి ఆల్ ఖైదా ఆ ఇస్లామిక్ మిషనరీ ఉద్యమాన్ని వాడుకుంటోందని చెప్పింది. ఆల్ ఖైదాకు ఆర్థిక సహాయం అందించే సోమాలియన్ ముహమ్మద్ సులేమాన్ పాకిస్తాన్ పర్యటనకు జమాత్ డాక్యుమెంట్లను వాడుకున్నట్లు వికీలీక్స్ తెలిపింది.