నాగంకు చెక్ చెప్పేందుకు ఎర్రబెల్లి ఇంట్లో తెలంగాణ టిడిపి వ్యూహం

అందుకు ఆయనపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారు. అంతేకాకుండా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను నాగం బహిరంగ సభకు కూడా వెళ్లేందుకు అంగీకరించారు. అయితే ఈ క్రెడిట్ అంతా నాగం ఒక్కడికే దక్కే అవకాశం ఉన్నందున తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు సోమవారం ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిలో సమావేశమయ్యారు. నాగం బహిరంగ సభను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారు చర్చించిన పిమ్మట త్వరలో నాగంకు ధీటుగా తెలంగాణ అంశాన్ని ప్రజలలోకి వెళ్లే విధంగా వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిని కూడా చంద్రబాబు అనుమతితో చేస్తున్నామనే భావన ప్రజలలో కల్పించే విధంగా ముందుకు వెళ్లి నాగంకు చెక్ చెప్పాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగం సభకు వెళ్లాలా, వద్దా అనే విషయంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications