జగన్ వర్గానికి ఆనం సోదరులు చెక్: విజయ డైరీ చైర్మన్‌గా సుధీర్ తొలగింపు

కాగా తాను జగన్‌కు మద్దతు పలుకుతున్నందునే తనపై కక్ష్యతో అవిశ్వాస తీర్మానం పెట్టించారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. కోర్టు అవిశ్వాసంపై స్టే విధించినప్పటికి ఎలా పెడతారని జగన్ వర్గం ప్రశ్నిస్తోంది. అయితే నెల్లూరు జిల్లా ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారిందని, కోర్టు నెల్లూరు జిల్లా అని మాత్రమే చెప్పినందున అది జిల్లాకు వర్తించదని కాంగ్రెసు వర్గం చెబుతోంది. ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం అవిశ్వాస తీర్మానం తంతు దగ్గర ఉండి మరీ జరిపించినట్లుగా తెలుస్తోంది. సుధీర్ రెడ్డి గతంలో జగన్ ఓదార్పులో పాల్గొనడమే కాకుండా, జగన్ పార్టీ వీడాక కూడా బహిరంగంగా మద్దతు తెలుపుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications