గెలిస్తే ఆయనకే నష్టం: వైయస్ జగన్‌పై డిఎల్ రవీంద్రారెడ్డి నిప్పులు

DL Ravindra Reddy
న్యూఢిల్లీ: ఎవరో చెంచా కొత్తగా పార్టీ పెట్టుకొని ఉప ఎన్నికలలో అక్రమాలు పాల్పడ్డంత మాత్రాన ఎలా అంటూ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప ఉప ఎన్నికల పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఆరుసార్లు ప్రజా మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. కానీ జగన్ అక్రమాలు చేసి గెలవాలని చూశారన్నారు. తాను ముప్పయ్యేళ్లుగా రాజకీయాలలో ఉన్నానని ఎప్పుడూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకొని పోటీ చేయలేదని చెప్పారు. జగన్ ఆస్తులపై, తన ఆస్తులపై, టిడిపి అభ్యర్థి మైసూరారెడ్డి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధంగా ఉండాలని తాను సవాల్ చేస్తే జగన్ ఛాలెంజ్ స్వీకరించలేక పోయాడన్నారు. అంటే ఆయన ఆస్తులు అక్రమమేనని స్పష్టమవుతుందన్నారు.

సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారని అన్నారు. సోనియా పదవులు వదులుకున్న త్యాగమూర్తి అన్నారు. జగన్ పదవుల కోసం ప్రాకులాడుతున్న వ్యక్తి అన్నారు. సోనియా కాలిగోటికి కూడా సరిరారన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రులు బాగా కష్టపడ్డారన్నారు. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ శశిభూషణ్ పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. తాను ఉప ఎన్నికల సందర్భంగా దాడులు చేశారనే ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. తాను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ గెలిస్తే అతనికే నష్టం అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+