ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటాడు, లగడపాటి తీరు అంతే: ఎంపీ గుత్తా

ఫ్రీజోన్ అంశం తేలాకే ప్రభుత్వం ఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 14 ఎఫ్ క్లాజ్ తొలగించకుండా పరీక్షలను నిర్వహిస్తే సరికాదన్నారు. అలా నిర్వహిస్తే తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరిగినట్లేనని అన్నారు. ఆయన ఇదే విషయంపై ముఖ్యమంత్రిని కలిసి పరీక్షలు నిర్వహించరాదని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా అంతకుముందు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కూడా 25వ తేది లోగా 14 ఎఫ్ నిబంధన తొలగించాలని డిమాండ్ చేసింది. ఆ లోపు తొలగించకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications