వదిన వైయస్ విజయమ్మపై పులివెందులలో వైయస్ వివేకాకు ఓటమే

కాగా, కడప లోకసభ స్థానంలో డిఎల్ రవీంద్రా రెడ్డి 17 శాతం ఓట్ల తేడాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై ఓడిపోయే అవకాశాలున్నట్లు వారు చెప్పారు. అయితే, తేడా 14, 15 శాతం మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు డబ్బులు పెద్ద యెత్తున పంచారని కడప జిల్లా కాంగ్రెసు నాయకులు ఆరోపించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ నాలుగు లక్షల ఓట్ల తేడాతో గెలుస్తారని తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రకటనపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. లగడపాటి రాజగోపాల్ సర్వేలో వాస్తవం లేదని, అంత భారీ తేడా ఉండదని ముఖ్యమంత్రి అన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications