మాట తప్పిన వైయస్ వివేకా, మంత్రిగా విధులకు హాజరు

మంగళవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. వైయస్ వివేకానంద రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాల కింద ఎమ్మెల్సీ పూర్తయినప్పటికీ గవర్నర్ కోటా కింది ఎమ్మెల్సీ స్థానాలను ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. వైయస్ వివేకానంద రెడ్డి కోసమే వాటిని భర్తీ చేయడం లేదని, పులివెందుల ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత భర్తీ చేసి వివేకాకు స్థానం కల్పిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు చెబుతూ వచ్చారు. గాలి ముద్దు కృష్ణమనాయుడి మాటే నిజమవుతోంది.












Click it and Unblock the Notifications