వైయస్ జగన్‌తో కలిసి పని చేసేది లేదు: వైయస్ వివేకానంద రెడ్డి

పులివెందుల ఉప ఎన్నికల్లో తమ వదిన వైయస్ విజయమ్మ గెలిస్తే సానుభూతితో గెలిచినట్లేనని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై మాట్లడడానికి ఆయన నిరాకరించారు. పరీక్షలు రాసిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తాను చిన్నప్పటి నుంచి ఆలోచించేవాడిని కానని, సెలవులు తీసుకోవడమే అలవాటు అని ఆయన అన్నారు. దేవుడు ఎలా పెట్టి ఉంటే అలా జరుగుతుందని ఆయన ఫలితాలపై అన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ అధిష్టానం నుంచి లేదని ఆయన చెప్పారు. ఆయన మాటలను బట్టి వివేకానంద రెడ్డి మంత్రిగా కొనసాగడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications