వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పదవిపైనే చిరంజీవికి మక్కువ, పార్టీ పదవిపై అయిష్టత

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కేంద్రంలో మంత్రి పదవినే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. విలీన ప్రక్రియపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చిన చిరంజీవి ఈ విషయాన్ని అధిష్టానానికి స్పష్టంగా చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ పదవుల వల్ల ఒరిగేదేమీ ఉండదని, పైగా అనవసరమైన చిరాకులు తలెత్తుతాయని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో చేరితే ఒత్తిడి ఉండదని, అధిష్టానం కోరితే ప్రచార కార్యక్రమాలకు వెళ్లవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి సిడబ్ల్యుసిలో స్థానం కల్పించవచ్చుననే వార్తలు వచ్చాయి. నిజానికి, సిడబ్ల్యుసి పదవి గౌరవప్రదమైందే. అయితే, తనకు పార్టీ పదవులు అక్కర్లేదని, మంత్రి పదవి కావాలని సోనియాకు చిరంజీవి చెప్పే అవకాశం ఉంది. అయితే తనకు మంత్రి పదవి కావాలని ఆయన నేరుగా అడిగే అవకాశాలు లేవని అంటున్నారు. తనకు పార్టీ పదవులు వద్దని చెప్పడం ద్వారా కేంద్రంలో మంత్రి పదవిని కోరుకుంటున్నట్లు సంకేతాలు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. విలీన ప్రక్రియ పూర్తయిన వెంటనే చిరంజీవికి పార్టీలో ఏదో ఒక పదవిని కట్టబెట్టే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది.

విలీన ప్రక్రియ సభ భారీగా జరగాలని చిరంజీవి ఆశిస్తున్నారు. ఈ సభకు సోనియా రావాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ లాగా విలీన సభ కూడా భారీగా జరగాలనేది ఆయన ఉద్దేశం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చిరంజీవి అధిష్టానం నాయకులతో ఆయన విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.

English summary
It is learnt that Prajarajyam party president Chiranjeevi is not interested in party post. He is wanting ministerial post at centre
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X