గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి వైయస్ జగన్ దీక్ష, ఈసారి గుంటూరులో 48 గంటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నికలు పూర్తి కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మళ్లీ దీక్షపై దృష్టి పెట్టారు. ఈ నెల 15వ తేదీ వైయస్ జగన్ 48 గంటల పాటు రైతు సమస్యలపై దీక్ష చేస్తారని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం ప్రస్తుతానికి వైయస్ జగన్‌కు లేదని ఆయన చెప్పారు. పదవి పోతుందనే భయంతోనే కాటసాని రాంరెడ్డి తిరిగి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెంత చేరారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13వ తేదీన వెలువడనున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత రెండో రోజు జగన్ గుంటూరులో దీక్షకు దిగుతున్నారు.

English summary
YSR Congress party president YS Jagan will takeup 48 hours fast from May 15 at Guntur on farmers' plight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X