న్యూఢిల్లీ: తమిళనాడులో కరుణానిధి సారథ్యంలోని డిఎంకె, జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె హోరాహోరీగా ఉన్నాయి. కాగా అన్నాడిఎంకే 28 స్థానాల్లో, డిఎంకె 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 234 సీట్లలో జయలలిత కూటమి స్వల్ప ఆధిక్యంలో ముందుకు పోతోంది. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థులు కరుణానిధి, జయలలిత కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.