మేం ఓడిపోయాం, ఫలితాలు ఆశ్చర్యకరమైనవి కావు: డి. శ్రీనివాస్

వైయస్ అమలు చేసిన పథకాలు కాంగ్రెసు ముఖ్యమంత్రిగా చేసినవని కాకుండా వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి అమలు చేసినవనే భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఉప ఎన్నిక అని ఆయన అన్నారు. కాంగ్రెసు అభ్యర్థులకు తక్కువ ఓట్లు రావడంపై ప్రశ్నించగా, ఓటమి ఓటమేనని ఆయన జవాబిచ్చారు. ఫలితాలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే బాధ్యత ఏముంటుందని, సమిష్టి బాధ్యత అని ఆయన సమాధానమిచ్చారు. కడప జిల్లా నాయకులు సమిష్టిగా పని చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications