న్యూఢిల్లీ: కేరళలో ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ వెనుకంజలో ఉన్నారు. అచ్యుతానందన్‌కు ముందుగా పార్టీ టిక్కెట్ కూడా కేటాయించలేదు. అనంతరం పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపకుండా ఉండటానికి టిక్కెట్ కేటాయించారు. అయితే ఎన్నికలలో మాత్రం ఆయనే ఓడిపోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్ కూటమి 66 సీట్లలో, కాంగ్రెసు ఆధ్వర్యంలోని యుడిఎఫ్ కూటమి 72 సీట్లలో ముందంజలో ఉండగా, 3 సీట్లలో ఇతరులు ముందంజలో ఉన్నారు.