జగన్ ముందు ఉడకని కిరణ్ కుమార్ పప్పులు, మరిన్ని తిప్పలు

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పప్పులు ఉడకలేదు. కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం ఎక్కువగా ముఖ్యమంత్రిపైనే పడే అవకాశం ఉంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. పైగా, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారని అంటారు. వైయస్ జగన్‌ను దెబ్బ కొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి పన్నిన వ్యూహాలేవీ ఫలించలేదు.

తెలుగుదేశం పార్టీ నుంచి కందుల సోదరులను కాంగ్రెసు పార్టీలోకి రప్పించిన ఫలితం ఏ మాత్రం కనిపించలేదు. వైయస్ జగన్ వర్గం నుంచి బద్వేలు శాసనసభ్యురాలు కమలనమ్మను వెనక్కి రప్పించడంలో సాధించిన విజయం కూడా ఫలితం చూపించలేదు. బద్వేలు శానససభ నియోజకవర్గంలో వైయస్ జగన్‌కు భారీ మెజారిటీ వచ్చింది. వైయస్ జగన్ వెంట వెళ్తున్న నలుగురు శాసనసభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఫలితం కనిపించలేదు. కడప నియోజకవర్గంలో 16 మంది మంత్రులను దింపినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం గానీ ముఖ్యమంత్రి ప్రచారం గానీ జగన్‌కు లభించిన ఆదరణ ముందు దిగదుడుపే అయ్యాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. మెజారిటీ తగ్గి ఉండి, కాంగ్రెసు అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వగలిగినా కిరణ్ కుమార్ రెడ్డిపై అ ప్రభావం పడేది కాదు. కానీ, కాంగ్రెసు అభ్యర్థులు వైయస్సార్ కాంగ్రెసు ముందు తేలిపోయారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిని మరింతగా కష్టాల పాలు చేయడానికి వైయస్ జగన్ వర్గం తమ కత్తులకు పదును పెడతారనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+