కడప కింగ్ వైయస్ జగన్, ఐదు లక్షలకు పైగా మెజారిటీతో విజయం

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్ కడప కింగ్‌గా అవతరించారు. అంచనాలకు మించి ఆయన కడప లోకసభ స్థానంలో మెజారిటీ సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెసు ప్రత్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిపై 5 లక్షల 43 వేల 053 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డికి గానీ తెలుగుదేశం అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డికి గానీ డిపాజిట్లు కూడా దక్కలేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి రికార్డును జగన్ కడప లోకసభ స్థానంలో బద్దలు కొట్టారు. 1991లో వైయస్ రాజశేఖర రెడ్డికి 4 లక్షల 18 వేల మెజారిటీ వచ్చింది.

అయితే, జగన్ మాజీ ప్రధాని పివి నరసింహారావు రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు. ప్రధానిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పోటీ చేసిన పివి నరసింహా రావుకు 5 లక్షల 70 వేల పైచిలుకు మెజారిటీ లభించింది. కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వైయస్ జగన్ తిరుగు లేని ఆధిక్యతను ప్రదర్శించారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మైదుకూరు శాసనసభ స్థానంలో వైయస్ జగన్‌కు 60 వేలకు పైబడి మెజారిటీ లభించింది. డిఎల్ రవీంద్రా రెడ్డి స్వగ్రామం సుంకేశులలో జగన్‌కు పది వేల మెజారిటీ లభించింది.

కాగా, పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ కన్నా వైయస్ జగన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. తన తల్లి వైయస్ విజయమ్మకు వచ్చిన మెజారిటీ కన్నా దాదాపు 20 వేల ఓట్ల జగన్‌కు ఎక్కువ ఎక్కువ మెజారిటీ లభించింది. విజయమ్మకు పులివెందుల శాసనసభా నియోజక వర్గంలో 85,191 ఓట్ల మెజారిటీ రాగా, వైయస్ జగన్‌కు తన ప్రత్యర్థులపై లక్షా 8వే 133 ఓట్ల మెజారిటీ లభించింది. వైయస్ విజయమ్మపై వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేయడంతో వైయస్ విజయమ్మ మెజారిటీ తగ్గిందని భావించవచ్చు. పార్లమెంటు సీటుకు వచ్చే సరికి వైయస్ వివేకానంద రెడ్డికి పడిన ఓట్లు చాలా వరకు జగన్‌కు పడినట్లు చెప్పవచ్చు. ఈ విజయంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+