పులివెందుల అసెంబ్లీ స్థానంలో వైయస్ విజయమ్మ ఆధిక్యం
State
oi-Pratapreddy
By Pratap
కడప: పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పులివెందుల శాసనసభా స్థానానికి ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ విజయమ్మపై వెనకబడిపోయారు.
కడప లోకసభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జగన్ 22 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.