మధ్యలోనే ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయిన వైయస్ వివేకా
State
oi-Pratapreddy
By Pratap
కడప: కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తన ఓటమి ఖాయం కావడంతో ఆయన నిరాశతో ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. వదిన వైయస్ విజయమ్మపై ఆయన భారీగా వెనకబడిపోయారు. అబ్బాయ్ వైయస్ జగన్‌ను సవాల్ చేసి పులివెందులలో పోటీకి దిగిన వైయస్ వివేకానంద రెడ్డి తగిన ప్రాబల్యం సాధించలేకపోయారు.
వైయస్ విజయమ్మ పులివెందుల శానససభా నియోజకవర్గంలో 26 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. కాంగ్రెసు పార్టీ ఓట్లు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు పడినట్లు తెలుస్తోంది.