గోనె సంచులు మీరివ్వకపోతే నేను ఇస్తా: ప్రభుత్వానికి చంద్రబాబు ఆఫర్

ప్రభుత్వం దళారుల పక్షపాతిగా వ్యవహరిస్తోందన్నారు. మిర్యాలగూడలో చంద్రబాబు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రైతుల్లో ఐక్యత రావాలని కోరుకున్నారు. వారంతా సంఘటితం అయి ప్రభుత్వంపై పోరాడితే తప్ప రైతులకు న్యాయం జరిగేలా లేదన్నారు. రైతులకు గోనె సంచులు కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం గోనె సంచులను ఇవ్వలేక పోతే తాను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వానికి, రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా 19న రహదాలు దిగ్బంధం ఉంటుందన్నారు. కాగా జిల్లాలో చంద్రబాబు పర్యటనను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే అక్కడే ఉన్న టిడిపి కార్యకర్తలు కూడా అందుకు ధీటుగా స్పందించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కలుగ జేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications