జయలలిత చుట్టూ అన్ని పార్టీల చక్కర్లు, స్టార్ అట్రాక్షన్ ఆమెనే

కాగా, వామపక్షాలు, తెలుగుదేశం తదితర పార్టీలతో కూడిన తృతీయ కూటమి నుంచి తప్పుకోకుండా చూసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయం సాధించిన వెంటనే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు జయలలితకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. సోమవారం జరిగిన జయ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు సహా సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ హాజరయ్యారు.
బిజెపి నాయకులు కూడా ఎటు పోయి ఎటు వస్తుందో అనే ఉద్దేశంతో జయలలితతో స్నేహ సంబంధాలను నెరపడానికి ప్రయత్నిస్తున్నారు. జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు నరేంద్ర మోడీ హాజరయ్యారు. మొత్తం మీద, జాతీయ రాజకీయాల్లో జయలలిత ప్రధాన పోషించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications