నారా లోకేష్ రాజకీయ ఎంట్రీకి తొందరపడుతున్న చంద్రబాబు?

చంద్రబాబు ప్రకటనతో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఉడికిపోతున్నట్లు తెలుస్తోంది. తమ కత్తులకు మరింత పదును పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. తన సోదరుడు బాలకృష్ణతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా ఆయన వెనకాడడం లేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల్లో గెస్ట్ రోల్ నుంచి బాలయ్యను తప్పించి హరికృష్ణకు అవకాశం లభించడమే ఇందుకు నిదర్శనమని కూడా అంటున్నారు. చంద్రబాబును ఎదిరించే స్థితిలో లేకపోవడంతో బాలకృష్ణను పక్కన పెట్టాలని కూడా ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
నారా లోకేష్‌ను పార్టీలోకి తెచ్చిన వెంటనే మంట పెట్టాలని హరికృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. దీన్ని చంద్రబాబు సవాల్‌గానే స్వీకరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబ సభ్యుల్లోని అవగాహన రాహిత్యం, అనుభవలేమి తనకు ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా, తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభం తప్పదేమేనని అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications