చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న సూపర్ స్టార్ రజనీకాంత్!

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ న్యూమేనియా, మూత్రపిండాలు, పేగు సంబంధ సమస్యలతో మరోసారి చెన్నైలోని పోరూర్‌లోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ హాస్పిటల్‌లో చేరారు. రజనీకి ఇప్పుడు 61 సంవత్సరాలు. రజనీకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మరియు కడుపు సంబంధ చికిత్సలు జరుగుతున్నాయి. నిత్యం పొగ త్రాగడం, మందు తాగడం తదితర కారణాల వల్ల ఇతను ఆనారోగ్యం పాలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు హాస్పిటల్ వెళ్లిన రజనీ శనివారం ఉదయం మళ్లీ హాస్పిటల్‌లో చేరి సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం మరోసారి హాస్పిటల్‌లో చేరినట్లు వార్తలు వచ్చాయి. రజనీ న్యూమేనియాతో బాధపడుతున్నట్టు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు.

రజనీ బ్లడ్ రిపోర్ట్స్ కిడ్నీ చెడిపోవడం, అజీర్తితో బాధపడుతున్నట్లు చూపిస్తున్నాయి. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ బాగు చేయడానికి యాంటీ బయోటిక్స్‌ను ఎక్కిస్తున్నారు. రజనీ ఐసియులో లేరని, ఆరోగ్యం మెరుగు పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఏప్రిల్ 29న రాణా షూటింగ్ సమయంలో మొదటిసారి కాస్త అస్వస్థతకు గురవడంతో సెయింట్ ఇసాబెల్ హాస్పిటల్‌లో చేర్చారు. రజనీ డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని వారు చెప్పారు. ఆయనను అదే రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు.

మే 4న మరోసారి శ్వాస సంబంధ బాధతో హాస్పిటల్ పాలయ్యారు. వారం రోజుల అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. అయితే రజనీకాంత్ ఆరోగ్యంపై పలు పుకార్లు రావడంతో రజనీ సతీమణి లతా రజనీకాంత్ ఆయన ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేశారు. రజనీ ఆరోగ్యానికి ఏమీ సమస్య లేదని చెప్పారు. అయితే శనివారం, ఆదివారం మరోసారి హాస్పిటల్ పాలు అయ్యారు. ఇటీవల తరుచూ అనారోగ్యంతో బాధపడుతున్న రజనీని చికిత్స కోసం విదేశాలకు తీసుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+