రైతులకు ఇబ్బందులు నిజమే, ఉచిత విద్యుత్ ఇస్తాం: కిరణ్

Kiran Kumar Reddy
మెదక్‌: రైతులకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలోని దాస్‌గడ్డ తండాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రైతు చైతన్యయాత్రను ప్రారంభించారు. జూన్‌ 2 వరకు ఈ యాత్రలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రైతు చైతన్యయాత్ర సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పథకాలను వివరించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించే ఈ చైతన్యయాత్రకు పలు ప్రాంతాల్లో రైతుల నుంచే నిరసన ఎదురయ్యింది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడమే రైతు చైతన్య యాత్రల ఉద్దేశమని ముఖ్యమంత్రి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. దాదాపు 50 వేల గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు జరుగుతాయని, డివిజన్లవారీగా రైతు సదస్సులు జరుగుతాయని ఆయన అన్నారు. పదో తరగతి చదివినవారు కూడా ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+