అలీకి ఓ న్యాయం, జగన్‌కు మరో న్యాయమా: వి హనుమంతరావు

అవినీతి విషయంలో హసన్ అలీకి ఓ న్యాయం, వైయస్ జగన్‌కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. జగన్ సాక్షిలోకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. రైతుల భూములు అన్యాయంగా వశం చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబట్టి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. జగన్ వర్గం కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలో ఇద్దరు కాంగ్రెసు ఎంపీలు పార్టీనే సవాల్ చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. అన్నాహజారే బాటలో కాంగ్రెసు కార్యకర్తలు అవినీతిపై పోరు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications