గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని చక్కదిద్దగలరా?

Ghulam Nabi Azad
హైదరాబాద్: క్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించగల నేర్పు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఉందని అంటారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన తర్వాత రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం హైదరాబాద్ వచ్చారు. పార్టీని చక్కదిద్దే పనిలో భాగంగానే ఆయన ఇక్కడికి వచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీ తీవ్ర గడ్డు సమస్యను ఎదుర్కుంటోంది. పార్టీని ధిక్కరిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంట శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంట నడుస్తున్నారు. తెలంగాణ సమస్య కొరకరాని కొయ్యగా తయారైంది. పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది.

పార్టీ నాయకులతో, మంత్రులతో, శానససభ్యులతో ఉమ్మడిగానూ విడివిడిగానూ చర్చించడానికి ఆయన సిద్ధపడ్డారు. జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోలేనంతగా పార్టీ నాయకత్వం బలహీనపడిందనే అభిప్రాయం నెలకొని ఉంది. తమపై చర్య తీసుకునే దమ్ము పార్టీకి లేదని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. ఇక, తెలంగాణ సమస్య పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం తప్ప మరోటి తమకు వద్దని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్టీ సీమాంధ్ర నాయకులు అంటున్నారు. ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారనేది ఆజాద్‌కు సవాలే.

ఇకపోతే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులోనే పరిస్థితి బాగా లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు. వారు ఆజాద్‌కు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు కూడా చేశారు. సీనియర్ మంత్రులు కూడా ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని చల్లార్చి పార్టీని ఏకతాటిపైకి ఆజాగ్ తేలగలరా అనేది ప్రశ్న.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+