12 గంటలకు వైయస్ జగన్ దీక్ష విరమణ, మూడో రోజుకు చేరిక

YS Jagan
గుంటూరు: రైతు సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన 48 గంటల దీక్ష మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. ఆయన ఆదివారంనాడు తన దీక్షను ప్రారంభించారు. ఆయన తన దీక్షను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విరమించనున్నారు. జగన్ దీక్షకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మంగళవారం కాంగ్రెసు శాసనసభ్యుడు శేషా రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపారు.

సోమవారం వైయస్ జగన్ దీక్షకు 17 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. శేషా రెడ్డి రాకతో ఆ సంఖ్య 18కి చేరుకుంది. దీక్ష విరమణ సమయానికి మరింత మంది శాసనసభ్యులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కాంగ్రెసు నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా దీక్షా శిబిరానికి చేరుకుని జగన్‌కు మద్దతు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+