ఆయనో సెక్స్ మెషీన్: 87 ఏళ్లలో 107 పెళ్లిళ్లు, 185 మంది పిల్లలు

ఈయన పేరు బెల్లో మసాబా, నైజీరియాకు చెందిన ఓ ఇస్లామిక్ వ్యక్తి.
అయితే ఏంటి ఇతని స్పెషల్..?
అది మామూలు స్పెషల్ కాదు, ఇతని రికార్డును మరెవరూ బద్దలు కొట్టలేరు కూడానూ.
అవునా మరి ఎంటా ఆ రికార్డ్..?
87 ఏళ్ల వయస్సున్న ఈ ముసలోడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 107 పెళ్లిల్లు చేసుకున్నాడు.
వామ్మో అన్ని పెళ్లిల్లే.. మరి పిల్లలు ఎంత మందో..?
జస్ట్ 185 మంది మాత్రమే.
అబ్బా.. మరి అంత మందిని పోషించడానికి ఏం చేస్తుంటాడో..?
ఇతని వృత్తి నాటు వైద్యం, కొంత పొలం కూడా ఉంది. నైజీరియాలో చాలా ఫేమస్ వ్యక్తి, ఎంత ఫేమస్ అంటే అక్కడి రాజకీయ నాయకుల కన్నా ఈయనే పెద్ద సెలబ్రిటీ.
అవునా మరి అంత మందికి ఇళ్లు ఎలా..?
ఈయనకు ఓ 85 గదుల ఇల్లు ఉంది. అందులో తన భార్యలు, పిల్లలు ఉంటారు.
మరి అన్ని పెళ్లిల్లు చేసుకుంటే చట్టాలు, ప్రభుత్వం ఏమీ అనలేదా..?
ఎందుకనలేదు.. అన్ని పెళ్లిల్లు చేసుకున్నందకు ఇతనిపై ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటే చేశారు. పోలీసులు జైల్లో కూడా పెట్టారు. కానీ ఆయన ముద్దుల భార్యలందరూ కలిసి పోలీసులను వేడుకోవడంతో స్పెషల్ కేసుగా పరిగణించి వదిలేశారు. (ఎంత అండస్టాండిగో కదా..!).
ఇంకా ఇతని జీవితంలోని స్పెషల్స్ ఏంటి..?
మసాబా పెద్ద భార్య వయస్సు 65 ఏళ్లు, చిన్న భార్య వయస్సు జస్ట్ 19 ఏళ్లు. మొత్తం 107 మంది భార్యల్లో 9 మంది చనిపోయారు, 12 మంది విడాకులు ఇచ్చి వెళ్లిపోయారు. మిగిలిన 86 మంది భార్యలతో ఈ 'తాతగారు' హ్యాపీగా కాపురం చేస్తున్నారు. అయితే ఇతని 185 మంది పిల్లల్లో దాదాపు 50 మంది వరకూ చనిపోయారు. మరి ఇలా పిల్లలు చనిపోయినందుకు మీరు బాధపడటం లేదా అని అడిగితే.. అస్సలు బాధపడటం లేదు, ఎందుకంటే వారిని దేవుడే ఇచ్చాడు, మళ్లీ దేవుడే వెనక్కు తీసేసుకున్నాడని వేదాంతం వల్లిస్తాడు. ఈయన స్టోరీలో కొసమెరుపు ఏంటంటే.. ఇప్పుడైనా సరే తనను పెళ్లి చేసుకోవడానికి మరో అమ్మాయి సిద్ధంగా ఉంటే 108 పెళ్లికి కూడా రెడీ అనేస్తున్నాడు. (తాజా జాగ్రత్తా.. 108 పెళ్లి చేసుకున్నావో.. 108 వాహనం ఎక్కడం మాత్రం ఖాయం) మరి ఇప్పుడు చెప్పండి ఇతను మనిషా లేక సెక్స్ యంత్రమా..!?












Click it and Unblock the Notifications