జాబితాలో పేరు లేక పోవడం నిజమే: తప్పు ఒప్పుకున్న చిదంబరం
National
oi-Srinivas G
By Srinivas
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో తలదాచుకున్న తీవ్రవాదుల పేర్లలో ఓ టెర్రరిస్టు పేరు లేక పోవడంపై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ఎట్టకేలకు బుధవారం తప్పును ఒప్పుకున్నారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఖాన్ పేరు లేక పోవడం తప్పే అని చెప్పారు. అయితే ఆ తప్పుకు మరెవరినీ బాధ్యులను చేయమని చెప్పారు. తప్పుకు మహారాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.
ఖాన్‌పై రెడ్ కార్నర్ నోటీసులు రద్దు చేశామని, మోస్ట్ వాంటెడ్ జాబితా నుండి తీసి వేశామని చెప్పారు. జాబితా నుండి ఆయన పేరును తీసి వేసిన విషయంపై విచారణ జరిపిస్తామని చెప్పారు.