టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు, కృష్ణా పిఎస్‌కు తరలింపు
State
oi-Srinivas G
By Srinivas
మహబూబ్‌నగర్: రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ మహబూబ్ నగర్ జిల్లా మాగనూరులో రాస్తారోకో చేస్తున్నతెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబును కృష్ణా పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ అవినీతిని అరికట్టి పేదలకు న్యాయం చేయడానికి నగదు బదిలీ పథకమే సరైందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.
కాగా అంతకుముందు దేవరకద్ర మార్కెట్ యార్డును పరిశీలించి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు కాంగ్రెసు ప్రభుత్వం సరియైన న్యాయం చేయలేక పోతున్నారని ఆరోపించారు.