కడప: కడప లోక్‌సభ సభ్యుడిగా వైఎస్ జగన్మోహనరెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయలక్ష్మి ప్రమాణ స్వీకారాలను నిరోధించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన న్యాయవాది పి.సత్యనారాయణ దీనిని దాఖలు చేశారు. పులివెందుల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రకటించిన ఆస్తుల వివరాలపై విచారణ జరిపించాలని కోరుతూ వాజ్యం ధాకలైంది. ఆస్తులను జగన్ చట్టబద్ధంగా సంపాదించారా, చట్టవిరుద్ధంగా సంపాదించారా అన్న అంశంతో సంబంధం లేదని, అన్ని ఆస్తులను నామినేషన్ సందర్భంగా వెల్లడించారా లేదా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య అభ్యర్థించగా పిటిషన్ దాఖలుకు జస్టిస్ బి.ప్రకాశరావు, జస్టిస్ పి.ఈశ్వరయ్యలతో కూడిన ధర్మాసనం అనుమతించింది. అయితే సమయం లేకపోవడంతో పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
A writ petition filed seeking a direction not to allow YS Jaganmohan Reddy and YS Vijayamma to take oath as member of Lok Sabha and Member of Legislative Assembly respectively will be listed before a vacation bench next Monday.