ఐసియులోకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్: కిడ్నీలకు డయాలసిస్

మూత్ర పిండాలు సరిగా పని చేయకపోవడం డయాలసిస్ చేయక తప్పడం లేదని వైద్యులు చెప్పారు. శరీరంలో సోడియం, ప్రోటీన్ స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు చెప్పారు. శ్వాస సంబంధమైన సమస్యతో రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. రక్తం కూడా ఎక్కించారు. ఆయనను హీమోడయాలసిస్ కింద ఉంచాలని నిర్ణయించినట్లు వైద్యులు చెప్పారు. మూత్ర పిండాలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. కింది శ్వాస నాళం ఇన్‌ఫెక్షన్ తొలగిపోతే సమస్య పరిష్కారమవుతుందని వారు చెప్పారు. రజనీకాంత్‌ను సందర్శించడానికి వస్తున్నవారిపై వైద్యులు ఆంక్షలు పెట్టారు.












Click it and Unblock the Notifications