భూములు లాక్కుని రైతులపై మొసలి కన్నీరు: వైయస్ జగన్‌పై విహెచ్

వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనక నుంచి కథ నడిపించింది జగన్ కాదా అన ఆయన అడిగారు. వైయస్ కుమారుడిగా భూములు లాక్కున్నది జగన్ కాదా అని ఆయన అడిగారు. లక్షల మెజారిటీ వచ్చిందని విర్రవీగుతూ కడప పౌరుషం గురించి జగన్ మాట్లాడుతున్నారని, కానీ కడప జిల్లా ప్రజలను జగన్ మోసం చేసిన విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు. బ్రాహ్మమి స్టీల్స్ కర్మాగారాన్ని స్థాపిస్తామని పది వేల ఎకరాలు తీసుకుని, ఇప్పుడు వెనక్కి తగ్గి కడప ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ కోసం ఓబుళాపురం గనులను తీసుకుని, ఇనుప ఖనిజాన్ని ఇతర దేశాలకు అమ్ముకుని కోట్లు గడించారని, ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టబోమని అంటున్నారని, ఇది ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. అనంతపురంలో స్థాపించదలిచిన సైన్స్ సిటీ ఏమైందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications