జూపల్లి-అరుణ వార్: దొరతనాన్ని తనపై చూపొద్దంటూ అరుణ వ్యాఖ్య

తెలంగాణా పేరుతో మహబూబ్ నగర్ జిల్లాలో ఆధిపత్యం కోసమే జూపల్లి పాదయాత్రను చేపట్టారన్నారు. జూపల్లి దొరతనాన్ని తన మీద రుద్దకండంటూ డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు. జూపల్లి విపక్షాలతో కుమ్మక్కై భూటకపు యాత్రను చేస్తున్నారని, ఆర్డీఎస్ తూములు పగులగొట్టిన రోజు జూపల్లి ఏమైపోయారని ఆమె ప్రశ్నించారు. తన స్వంత ప్రయోజనాల కోసమే జూపల్లి ఇవన్నీ చేస్తున్నారని అన్నారు.
కాగా.. అంతకు ముందు, మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి-అరుణల ఫైట్ కారణంగా ఏర్పడిని ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాసరావు వారిద్దరితో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. సంయమనం పాటించాల్సిందిగా డీకే అరుణ, జూపల్లి కృష్ణారావులకు ఆయన సూచించారు. ఇంకోవైపు ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి తన పాదయాత్రకు అనుమతిచ్చే వరకూ బెయిల్ తీసుకునే ప్రశ్నే లేదని జూపల్లి కృష్ణారావు మొండికేస్తున్నారు.