నాగంపై చర్యలకు తెలుగుదేశం రెడీ: బాబుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం

వారు నాగంపై రాతపూర్వకంగా పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో కూడా నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా నాగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నందునే చర్యలు తీసుకున్నారన్న పేరు వస్తుందన్న నెగిటివ్ భావన ప్రజల్లో ఏర్పడుతుందన్న ఉద్దేశ్యంతో ఇన్నాళ్లూ ఆగిన టిడిపి శనివారం పరిగిలో జరిగిన సభలో, సభకు ముందు నాగం మాట్లాడిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన సభలో టిడిపి అధినేత, పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందువల్ల చర్యలు తీసుకునే విషయంపై దాదాపుగా ఖరారయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్ర నేతలు నాగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications