'జగన్‌తో కలిసి నాగం కుట్ర, పార్టీ నుండి బహిష్కరణ ఆలోచన లేదు'

Errabelli Dayakar Rao
వరంగల్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీని తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నాడని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర పార్టీలను కాకుండా తెలంగాణకు కట్టుబడి ఉన్న టిడిపినే పార్టీలో ఉంటూ టార్గెట్ చేయడం కుట్ర కాక మరేమిటని అన్నారు. పార్టీ జెండా వదిలి ఉద్యమం చేయాలని డిమాండ్ చేస్తున్న నాగం టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెసు, సిపిఐ నాయకులను ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.

అన్ని పార్టీలో తమ తమ పార్టీ జెండాలు వదిలి ఉద్యమిస్తే తాము అందుకు సిద్ధమని ఆయన చెప్పారు. ముప్పయ్యేళ్లు పార్టీలో ఉండి వివిధ రకాల పదవులు అనుభవించి ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా నాగం వైఖరిని మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా తప్పు పట్టారు. టిడిపి జెండా పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం చేయాలనే నాగం డిమాండ్ సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నాగం కేవలం టిడిపినే టార్గెట్ చేస్తూ మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. నాగంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యం టిడిపికి ఏ కోశాన లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+