పాకిస్తాన్ నావల్ బేస్‌పై ఉగ్రవాదుల దాడి, పది మంది మృతి

మెహ్రాన్ నావల్ కేంద్రంలోకి 20 నుంచి 26 మంది ఉగ్రవాదులు ఆదివారం రాత్రి దూసుకొచ్చారు. కరాచీ విమానాశ్రయానికి ఈ నౌకాదళ స్థావరం అతి సమీపంలో ఉంది. రెండు విమానాలను ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. మిలిటెంట్లను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ నేవీ, స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జి) బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికాధికారులు, ఐదుగురు మిలిటెంట్లు మరణించినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది.
దాడి సమయంలో అమెరికా సాంకేతిక నిపుణులు నావల్ బేస్‌లో పనిచేస్తున్నట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. స్థావరంలో అమెరికావాళ్లు లేరని అమెరికా దౌత్య కార్యాలయం అధికారి స్పష్టం చేశారు. కొంత మంది చైనా అధికారులను కూడా మిలిటెంట్లు బంధించినట్లు పాకిస్తాన్ పత్రిక డాన్ రాసింది. ఈ దాడితో పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ అప్రమత్తమయ్యారు. త్రివిధ దళాల అధినేతలతో మాట్లాడారు. పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకోవాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications