స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసి, హత్య చేసిన భర్త

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురంలో మాయమైన ఓ మహిళ శవం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట అడవుల్లో తేలింది. వనస్థలిపురానికి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ అదృశ్యమైనట్లు రెండు రోజుల క్రితం పోలీసు కేసు నమోదైంది. దీంతో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. దీంతో ఆమె శవం మహబూబ్ నగర్ జిల్లాలో కనిపించింది. ఆమె భర్తపైనే అనంతలక్ష్మి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.

పోలీసులు అనంతలక్ష్మి భర్త నిరంజన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో తానే అనంతలక్ష్మిని హత్య చేశానని నిరంజన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గొడవల కారణంగానే ఈ ఘాతుకం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి అనంతలక్ష్మిని నిరంజన్ హత్య చేశాడని అంటున్నారు.

పెళ్లయిన మూడు నెలల తర్వాత ఆమెను పుట్టింటికి పంపించాడు. ఇటీవల ఆమెకు ఫోన్ చేసి రావాలని పిలిచాడు. అత్తగారింటికి వెళ్లి అనంతలక్ష్మిని తీసుకొచ్చాడు. ఆమెను ఉమెన్ హాస్టల్‌లో ఉంచాడు. ఈ నెల 20వ తేదీన ఆమెను కారులో తీసుకుని వెళ్లాడు. అక్కడే స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. అతనికి అనంతలక్ష్మి తల్లిదండ్రులు కోటి రూపాయలు కట్నం ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+