నాగం జనార్దన్ రెడ్డి వైయస్ జగన్‌కు అమ్ముడు పోయారు: మోత్కుపల్లి

నాగం జనార్దన్ రెడ్డిపై వేటు వేయాలని పార్టీకి లేదని, వేటు వేయించుకునేలా నాగం జనార్దన్ రెడ్డే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ అవసరాల కోసం నాగం జనార్దన్ రెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారని ఆయన అన్నారు. 1969లో చెన్నారెడ్డితో చేతులు కలిపి తెలంగాణను నాగం జనార్దన్ రెడ్డి మోసం చేశారని, అప్పటి మాదిరిగా తన రాజకీయావసరాల కోసం ఎవరినైనా బలి పెట్టడానికి నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడ్డారని ఆయన అన్నారు.
తాము తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు కలిసి వస్తే తాము వారితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు రాజీనామా చేయడానికి ముందుకు వస్తే తాము కూడా రాజీనామా చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి తెద్దామని, సోనియా ఇంటి ముందు ధర్నా చేద్దామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications