ఎఫ్‌సిఐ కార్యాలయంపై వరి రైతుల దాడి, అధికారుల నిర్బంధం
Districts
oi-Pratapreddy
By Pratap
వరంగల్: వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో వరి రైతులు ఆందోళనకు దిగారు. తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం ఆగ్రహించిన రైతులు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) కార్యాలయంపై రైతులు సోమవారం దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ముగ్గురు అధికారులను రైతులను నిర్బంధించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు అధికారులను వదిలిపెట్టేది లేదని రైతులు మొండికేశారు.
గత నాలుగైదు రోజులుగా అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో ఆందోళనకు దిగారు. ఎఫ్‌సిఐ గోడౌన్‌పై కూడా రైతులు దాడి చేశారు.