• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదు, చిరుతో బలోపేతం: రోశయ్య

By Pratap
|

Rosaiah
పుట్టపర్తి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆయన సోమవారం కన్యకా పరమేశ్వరికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని చిరంజీవి నిర్ణయం తీసుకోవడం వల్ల కాంగ్రెసు పార్టీ బలోపేతమైందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం అసాధ్యంగా మారిందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీకి తగిన సంఖ్యాబలం ఉందని, పడిపోయే స్థితిలో లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమాల ద్వారా పార్టీని క్రియాశీలం చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని, కాంగ్రెసువాదిగానే మరణిస్తానని ఆయన చెప్పారు.

English summary
Former CM K Rosaiah said that it is not possible to dismantle Government, as PRP decided to nerge in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X