వివాదం లేకుండానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచన

కాగా ఆరునెలల క్రితం ఎస్సై పరీక్షలు నిర్వహించాలని చూసినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరూ హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం తేలే వరకు పరీక్షలు నిర్వహించరాదని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. ఇలా పరీక్షలు నిర్వహించాలనుకున్నప్పుడల్లా వద్దని డిమాండ్లు రావడం పట్ల ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఫ్రీజోన్ నుండి ఆరో జోన్‌గా మార్చి ఎలాంటి వివాదం లేకుండా పరీక్షలు నిర్వహిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించడం వల్లనే కేంద్రమంత్రిని అంశంపై తేల్చమని కోరినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications