హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం వెనుక 20 మంది మాజీ ఎమ్మెల్యేలు: హరీశ్వర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harishwar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వెనుక తనతో పాటు 20 నుండి 30 మంది వరకు మాజీ శాసనసభ్యులు, ముఖ్య నేతలు ఉన్నారని రంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరిస్తే ఊరుకునేది లేదన్నారు. ఆయనను బహిష్కరిస్తే పార్టీకే నష్టమని అధినేత చంద్రబాబునాయుడుకు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నా నాగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా పార్టీకి నష్టమే అని ఆయన అన్నారు. నాగం సొంత లాభం కోసం ఉద్యమించడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం చిత్తశుద్ధితో ఆయన పోరాటం చేస్తున్నారని అన్నారు.

English summary
TDP senior MLA Harishwar Reddy said today that 20 to 30 MLAs are with Nagam Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X