చంద్రబాబుకు షాక్ టిడిపికి గోరంట్ల బుచ్చయ్య చౌదరీ గుడ్ బై!

రాజమండ్రి మేయర్ అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆయన అలక చెందినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ప్రస్తుతం డబ్బులు ఉన్న వారికి, కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా పార్టీ పరిస్థితిపై దృష్టి సారించలేని స్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరి చెప్పినట్టుగానే ఆయన నడుచుకోవడం వల్ల పార్టీ నష్ట పోయే పరిస్థితి తలెత్తుతోందని ఉద్దేశ్యంలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలో తాను ఎట్టి పరిస్థితుల్లో చేరేది లేదని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ తాను టిడిపికి రాజీనామా చేయాల్సి వస్తే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ జగన్‌తో మాత్రం వెళ్లే ప్రసక్తి లేదని మాత్రం ఆయన ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేసి సమస్యను బాబు దృష్టికి తీసుకు వెళతారని, పార్టీకి రాజీనామా చేయరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications