నాగం జనార్దన్ రెడ్డి వెంట ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారు?

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి, జోగు రామన్నలు కూడా నాగం జనార్దన్ రెడ్డి వెంట నడిచే అవకాశాలున్నాయి. తెలుగుదేశం ద్వతీయ, కిందిస్థాయి నాయకులు కూడా ఆయన వెంట నడిచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. తెలంగాణ ప్రజా సంఘాలు కూడా నాగం జనార్దన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. పైగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గాలు, సంఘాలు, తెలంగాణ ఉద్యమానికి దూరం జరిగిన శక్తులు నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications