వర్మకు పోలీసు షాక్, బెజవాడ రౌడీలు షూటింగ్‌కు అనుమతి రద్దు

శాంతిభద్రతలకు విఘాతం కలగదని స్క్రిప్టు చదివిన న్యాయ నిపుణులు చెప్తే షూటింగుకు అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. ఏయే సన్నివేశాలు ఎక్కడెక్కడ చిత్రీకరిస్తానే విషయాలు తెలియజేయాలని కూడా కమిషనర్ సూచించారు. స్క్రిప్టును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తామని, అందువల్ల స్క్రిప్టు ఇవ్వడం సాధ్యం కాదని సినిమా యూనిట్ అంటోంది. బెజవాడ రౌడీలు సినిమా టైటిల్‌పైనే మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడ రౌడీలు సినిమా షూటింగు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని, అందువల్ల సినిమా షూటింగు రద్దు చేయాలని న్యాయవాదులు సిపితో చెప్పారు.












Click it and Unblock the Notifications